Simran Reentry : ఆకాష్ పూరికి అత్తగా సిమ్రాన్ ?

Simran Rentry : ఆకాష్ పూరిని స్టార్ హీరోని చేయాలనీ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు దర్శకుడు పూరి... చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకున్న ఆకాష్ పూరిని

Krishna
Published on: 23 Aug 2020 3:43 PM IST
Simran Reentry : ఆకాష్ పూరికి అత్తగా సిమ్రాన్ ?
X

akash puri

Simran Rentry : ఆకాష్ పూరిని స్టార్ హీరోని చేయాలనీ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు దర్శకుడు పూరి... చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకున్న ఆకాష్ పూరిని మెహబూబాతో పూర్తి స్థాయి హీరోగా మార్చాడు. కానీ ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేదు.. ప్రస్తుతం ఆకాష్ పూరి హీరోగా " రొమాంటిక్ " అనే సినిమా తెరకెక్కుతుంది .. ఇందులో కేతికా శర్మ కథానాయకగా నటిస్తుంది. పూరి జగన్నాధ్ అందించిన కథ, కథనాలతో అనిల్ పొందూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని కథ, కథనాలతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు పూరి జగన్నాధ్.. అయితే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కూడా నటిస్తోందని తెలుస్తోంది.. ఈ సినిమాలో కేతికా శర్మకి తల్లిగా సిమ్రాన్ నటించనుందని తెలుస్తోంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు..

ఇక సిమ్రాన్ విషయానికి వచ్చేసరికి.. ఇక సిమ్రాన్ 1999 నుంచి 2004 వరకు టాలీవుడ్ లో అగ్ర కథానాయాకగా కొనసాగింది. సమరసింహ రెడ్డి, డాడీ, నువ్వొస్తావని, కలిసుందాం..రా! మొదలగు చిత్రాలు ఆమెకి మంచి పేరును తీసుకువచ్చాయి. ఈమె తమిళ, తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించింది. తమిళ చిత్ర పరిశ్రమలో "లేడీ సూపర్‌స్టార్" అని పేరు తెచ్చుకొంది. ఇక సిమ్రాన్ ఆమె చిన్ననాటి కుటుంబ స్నేహితుడు దీపక్ బగ్గాని పెళ్లి చేసుకొని సినిమా పరిశ్రమకి దూరంగా ఉంటుంది. మళ్ళీ ఆమె రీఎంట్రీ ఇస్తుంది అని తెలియడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక కరోనా క్రైసిస్ వల్ల పెండింగ్ షూట్ వాయిదా పడింది.

Krishna

Krishna

Next Story