Actress Shiva parvathi : వ‌దిన‌మ్మ సీరియ‌ల్ న‌టికి క‌రోనా పాజిటివ్‌

Actress Shiva parvathi : దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది.. ముఖ్యంగా ఈ కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ పైన ఎక్కువగా ఉందని

Krishna
Published on: 19 Aug 2020 1:12 PM IST
Actress  Shiva parvathi : వ‌దిన‌మ్మ సీరియ‌ల్ న‌టికి క‌రోనా పాజిటివ్‌
X
coronavirus (file photo)

Actress Shiva parvathi : దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది.. ముఖ్యంగా ఈ కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ పైన ఎక్కువగా ఉందని చెప్పాలి.. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.. అందులో భాగంగానే న‌టి శివ పార్వతి కూడా కరోనా బారిన పడ్డారు.ఈ స‌మ‌యంలో ఆమె ప‌డ్డ మాన‌సిక సంఘ‌ర్షణ‌ను తెలియ‌జేస్తూ ఆమె ఓ ఎమోష‌న్ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. శివపార్వతి ప‌లు తెలుగు చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.. ప్రస్తుతం సీరియ‌ల్స్‌ల‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న వదినమ్మ సీరియల్ బాగా పాపులర్ అయింది..

అందరికి నమస్కారం.. నాకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ప‌ది రోజులు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందాను.. అక్కడ కరోనా నుంచి కోలుకొని నిన్న రాత్రి ఇంటికి చేరాను. ఈ మధ్యలో రెండు ఆసుపత్రులు మారాను.. కరోనా సోకిన విషయాన్ని వదినమ్మ సీరియల్ యూనిట్ కి వెల్లడించాను.. కానీ నా గురించి ఎవ‌రూ ఏ ఆస్పత్రిలో ఉన్నారు? ఎలాంటి ప‌రిస్థితిలో ఉన్నారు? అని అడ‌గలేదు. ఇది దుర‌దృష్టం. అంటే ఎవ‌రి స‌మ‌స్య వాళ్లదే.. ఇక్కడ ఎవ‌రికి ఎవ‌రూ తోడుండ‌రు... నేను గత 5 ఏళ్ల నుంచి సినిమాలు చేయ‌క‌పోయినా ప‌రిస్థితి తెలుసుకుని జీవిత రాజ‌శేఖ‌ర్ సహాయం చేశారని వెల్లడించారు శివ పార్వతి. ఇక వ‌దిన‌మ్మ సీరియ‌ల్ ప్రొడ్యూస‌ర్ ప్రభాక‌ర్ కూడా త‌న బాగోగులు అడ‌గ‌లేద‌ని ఆమె భాగోద్వేగానికి లోనయ్యారు..

Krishna

Krishna

Next Story