MAA Elections 2021: మా అధ్యక్ష బరిలో బిగ్గ్ బాస్ ఫేమ్

MAA Elections 2021: హేమ ఎంట్రీతో అధ్యక్ష పదవి కోసం నలుగురు పోటీ

Sandeep Eggoju
Updated on: 23 Jun 2021 7:14 PM IST
Senior Actress Hema Participating in MAA Elections 2021
X

నటి హేమ (ఫైల్ ఇమేజ్)

MAA Elections 2021: మా అసోషియేషన్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. తాజాగా మా అధ్యక్షురాలిగా పోటీబరిలోకి సీనియర్ నటి హేమ బరిలో దిగారు. మా అధ్యక్ష పోటీలో ఇప్పటికే ప్రకాష్‌రాజ్, యువహీరో మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ బరిలో ఉండగా.. తాజాగా నాల్గో పోటీదారుగా నటి హేమ పేరు ఖరారయింది. తన వారి కోసమే మా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగుతున్నట్లు హేమ ప్రకటించారు.

మరోవైపు.. మా అసోషియేషన్‌లో హేమ గత కొన్నేళ్లుగా పలు బాధ్యతలు నిర్వహించారు. మా ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీగా హేమ సేవలందించారు. ఇప్పటి వరకూ అన్ని పదవులకూ న్యాయం చేశానన్న హేమ.. ఈ ఎన్నికల్లో మొదట ట్రెజరీ పదవికి పోటీ చేయాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే, తన సన్నిహితులు అధ్యక్ష పదవికి పోటీ చేయాల్సిందిగా సూచించినట్లు తెలిపారు. అందుకే మా అధ్యక్ష బరిలో నిలిచినట్లు హేమ ప్రకటించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story