Naresh: ఆ నటితో నాలుగో పెళ్లికి రెడీ అవుతోన్న సీనియర్‌ నటుడు నరేష్‌?

Senior Actor Naresh is Getting Married for the Fourth Time
x

Naresh: ఆ నటితో నాలుగో పెళ్లికి రెడీ అవుతోన్న సీనియర్‌ నటుడు నరేష్‌?

Highlights

Naresh: నాలుగో పెళ్లికి రెడీ అయిన నరేష్

Naresh: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం మళ్లీ తమ జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టడం చాలా కామన్ అయిపోయింది. తాజాగా ఈ జాబితాలో మరొక నటుడు చేరనున్నారు. అతను మరెవరో కాదు సీనియర్ నటుడు నరేష్. హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నరేష్ గత కొంత కాలంగా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఈ మధ్యనే "అంటే సుందరానికి" సినిమాలో నాని తండ్రి పాత్రలో నటించిన నరేష్ తాజాగా ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్దం అయ్యారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సీనియర్ హీరోయిన్ మరియు నిర్మాత అయిన విజయనిర్మల తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నరేష్ గతం లో హీరోగా నటించి మంచి హిట్లు అందుకున్నారు. వృత్తిపరంగా నరేష్ కరియర్ బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురికీ విడాకులు ఇచ్చిన నరేష్ తాజాగా ఇప్పుడు నటి పవిత్ర లోకేష్ తో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి మీడియా ముందుకి బాగానే కనిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం పవిత్ర లోకేష్ నరేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పవిత్ర లోకేష్ ఇప్పటికే తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చినప్పటికీ ఇంకా అధికారికంగా అవి మంజూరు కాలేదు. విడాకులు మంజూరు కాగానే వెంటనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories