పంజాగుట్ట స్మశానంలో ముగిసిన చంద్రమోహన్ అంత్యక్రియలు

Chandra Mohan: భౌతిక కాయానికి నివాళులు అర్పించిన పలువురు సినీ ప్రముఖులు

Shekhar G
Published on: 13 Nov 2023 5:51 PM IST
Senior Actor Chandra Mohan Last Rites Are Over
X

పంజాగుట్ట స్మశానంలో ముగిసిన చంద్రమోహన్ అంత్యక్రియలు

Chandra Mohan: సీనియర్ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ముగిశాయి. చంద్రమోహన్ తీవ్ర అనారోగ్యం కారణంగా నవంబరు 11న కన్నుమూశారు. అమెరికాలో ఉన్న పెద్ద కుమార్తె హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఆయన నివాసం నుంచి పంజాగుట్ట శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర జరిగింది. అశ్రునయనాల మధ్య ఆయన అంతిమ సంస్కారాలు ముగిశాయి. చంద్రమోహన్ సోదరుడు దుర్గాప్రసాద్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

చంద్రమోహన్ భౌతిక కాయానికి పలువురు సినీ ప్రముఖులు కడసారి నివాళులు అర్పించారు. చంద్రమోహన్‌కు గతంలో బైపాస్ సర్జరీ జరిగింది. హృద్రోగంతోపాటు కిడ్నీ సంబంధ సమస్య కూడా తలెత్తడంతో ఆయన కోలుకోలేకపోయారు. తన నివాసంలో సొమ్మసిల్లి పడిపోయిన ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.

Shekhar G

Shekhar G

Next Story