Sekhar Master: శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం..

Sekhar Master: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్ లలో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు.

Arun Chilukuri
Published on: 16 April 2024 5:24 PM IST
Sekhar Master Sister in Law Passes Away
X

Sekhar Master: శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం..

Sekhar Master: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్ లలో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలతో పని చేసి ఎప్పటికప్పుడు తన డాన్స్ కొరియోగ్రఫీ తో బ్లాక్ బస్టర్ లు అందుకుంటూనే ఉంటారు శేఖర్ మాస్టర్. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న ఇతడి ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. తన వదిన చనిపోయారని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.

ఆమె మరణానికి గల కారణాలను మాత్రం మాస్టర్ వెల్లడించలేదు. ‘వదిన మిస్ యూ.. నువ్వు ఎంతో బాధను అనుభవించావ్.. అయినా ఎంత ధైర్యంగా నిలబడ్డావ్.. నువ్వే నాకు ధైర్యాన్న నూరిపోసావ్.. జీవితంపై సానుకూల దృక్పథాన్ని అందించావ్. ఇక నువ్వు లేవనే వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతోన్నాను. ఇప్పుడైనా మంచి ప్రదేశంలో (స్వర్గం)లో చేరి ఉంటావ్ అని ఆశిస్తున్నాను. నువ్వెప్పుడూ మాతోనే ఉంటావ్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు శేఖర్ మాస్టర్.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story