అసలు రిహార్సల్స్ చేయని హీరో ఎవరో చెప్పిన శేఖర్ మాస్టర్...

Sekhar Master: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్ లలో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు...

Shireesha
Updated on: 4 May 2022 4:30 PM IST
Sekhar Master Revealed Hero name who Do not Come to Rehearsal for Dancing | Tollywood Gossips
X

అసలు రిహార్సల్స్ చేయని హీరో ఎవరో చెప్పిన శేఖర్ మాస్టర్...

Sekhar Master: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్ లలో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలతో పని చేసి ఎప్పటికప్పుడు తన డాన్స్ కొరియోగ్రఫీ తో బ్లాక్ బస్టర్ లు అందుకుంటూనే ఉంటారు శేఖర్ మాస్టర్. తాజాగా "లవ్ స్టోరీ" సినిమాలో "సారంగదరియా", "పుష్ప" సినిమాలో "సామి సామి", "వరుడు కావలెను" లో "దిగు దిగు", పాటలకు కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ "ఆచార్య" మరియు మహేష్ బాబు నటించిన "సర్కారు వారి పాట" సినిమాలకు కూడా కొరియోగ్రఫీ చేశారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. మన టాలీవుడ్ స్టార్స్ లో తక్కువ రిహార్సల్స్ చేసే హీరో ఎవరు అని అడగగా శేఖర్ మాస్టర్ వెంటనే ఎన్టీఆర్ గారు అని చెప్పారు. "ఇప్పటి దాకా ఎన్టీఆర్ సార్ ఒక్కసారి కూడా రిహార్సల్స్ కి రాలేదండి. ఎప్పుడూ డైరెక్ట్ గానే చేసేస్తారు" అని చెప్పుకొచ్చారు శేఖర్ మాస్టర్.

గతంలో ఎన్టీఆర్ తో "బంతిపూల జానకి", "ఇట్టాగే రెచ్చి పోదాం", "రాకాసి రాకాసి", "పక్కా లోకల్", "ఆపిల్ బ్యూటీ", "స్వింగ్ జర" తదితర పాటలకి కొరియోగ్రాఫర్ గా పనిచేసిన శేఖర్ మాస్టర్ తాజాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న #ఎన్టీఆర్30 సినిమాలో కూడా కొన్ని పాటలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story