Sekhar Kammula: అందుకే మల్టీ లింగువల్ మూవీ చేస్తున్నా అంటున్న శేఖర్ కమ్ముల

* శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొదటి సినిమా ఇది

admin1
Updated on: 8 Oct 2021 5:52 PM IST
Sekhar Kammula Shared Some Interesting Things about the Film with Dhanush in an interview
X

 ధనుష్ - శేఖర్ కమ్ముల(ఫోటో-ది హన్స్ ఇండియా)

Sekhar Kammula: ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన "లవ్ స్టోరీ" సినిమా తో త్వరలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల టాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఒక సినిమా చేయబోతున్నారు. శేఖర్ కమ్ముల ధనుష్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొదటి సినిమా ఇది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు శేఖర్ కమ్ముల.

"ధనుష్ తో నేను చేయబోయే సినిమాలో ప్రేమ కథ ఉండదు. సినిమా మొత్తం ఒక త్రిల్లర్ గానే నడుస్తుంది. ఇది నా మొట్ట మొదటి మల్టీ లింగువల్ సినిమా. తెలుగు తమిళంలో మాత్రమే కాక ధనుష్ కు హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేయాలని అనుకుంటున్నాము. వివిధ భాషల్లో విడుదల చేయడం వల్ల నిర్మాతలకు కూడా సేఫ్ సైడ్ వుంటారు" అని చెప్పుకొచ్చారు శేఖర్ కమ్ముల. ఇక ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు శేఖర్ కమ్ముల రానా దగ్గుబాటి హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన "లీడర్" సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

admin1

admin1

Next Story