Love Story Trailer: శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ ట్రైలర్ విడుదల

Love Story Trailer: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ లవ్ స్టోరీ ట్రైలర్ ఇవాళ విడుదలైంది.

admin1
Updated on: 8 Oct 2021 5:30 PM IST
Love Story Trailer: శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ ట్రైలర్ విడుదల
X

Love Story Trailer: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ లవ్ స్టోరీ ట్రైలర్ ఇవాళ విడుదలైంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ క్రేజీ మూవీలో హీరోగా నాగచైతన్య, హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తున్నారు. మరోసారి శేఖర్ కమ్ముల గ్రామీణ నేపధ్యంలో సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఈ ట్రైలర్‌లో నాగచైతన్య చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. '' రిక్షా తొక్కుకునేటోడికి కొత్త రిక్షా కొనిస్తే రిక్షానే తొక్కుకుంటాడు.

గొర్లు మేపుకునేవాడికి గొర్లు కొనిస్తే గొర్లనే మేపుకుంటాడు. ఇలా అయితే మేమెలా డెవలప్ అవుతాం సర్'' అని నాగ చైతన్య చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజెన్స్‌ని ఆకర్షిస్తోంది. ఇక.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.


admin1

admin1

Next Story