The Ghost: "ది ఘోస్ట్" టైటిల్ వెనుక కథ చెప్పిన నాగార్జున

The Ghost: ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా ఇప్పుడు "ది ఘోస్ట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

Arun Chilukuri
Published on: 24 Sept 2022 12:33 PM IST
Secret Behind The Nagarjuna’s Title ‘The Ghost’
X

The Ghost: "ది ఘోస్ట్" టైటిల్ వెనుక కథ చెప్పిన నాగార్జున

The Ghost: ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా ఇప్పుడు "ది ఘోస్ట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్గా సోనాల్ చౌహాన్ నటిస్తోంది. అయితే ఈ సినిమా ఆసక్తికరమైన టైటిల్ వెనుక ఒక చిన్న కథ ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న నాగార్జున ను సినిమాకి "ది ఘోస్ట్" అనే టైటిల్ ను ఎందుకు పెట్టాలని అనిపించింది అని అడగగా సినిమాకి ఎప్పటినుంచో "ది ఘోస్ట్" అనే టైటిల్ ని పెట్టాలని అనుకుంటున్నట్లుగా నాగార్జున తెలిపారు. కానీ అప్పుడే విడుదలైన కమల్ హాసన్ మరియు లోకేష్ కనగరాజ్ సినిమా పోస్టర్లో "వన్స్ అపాన్ ఏ టైం, దేర్ లీవ్డ్ ఏ ఘోస్ట్" అని రావడంతో తమ సినిమాకు వేరే టైటిల్ను వెతికి "విక్రం గాంధీ" అని పెట్టాలని అనుకున్నారట.

సినిమాలో నాగార్జున పాత్ర పేరు విక్రమ్ గాంధీ. పైగా నాగార్జున బ్లాక్ బస్టర్ సినిమాలలో ఒకటైన "విక్రమ్" కు స్పిన్ ఆఫ్ లాగా ఉంటుందని ప్రవీణ్ సత్తారు కూడా ఈ టైటిల్ను ఖరారు చేశారు. కానీ కమల్ హాసన్ తమ సినిమాకి "విక్రమ్" అనే టైటిల్ ను పెట్టేశారు. దీంతో మళ్లీ ముందుగా అనుకున్న "ది ఘోస్ట్" ని తమ సినిమాకి టైటిల్ గా పెట్టామని స్పష్టం చేశారు నాగార్జున.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story