Adi Purush UpDates: ఆదిపురుష్ నుంచి సెకండ్ ట్రైలర్, ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

Adi Purush UpDates: ఆదిపురుష్ నుంచి సెకండ్ ట్రైలర్, ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
x

Adi Purush Up Dates: ఆదిపురుష్ నుంచి సెకండ్ ట్రైలర్, ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

Highlights

ఆదిపురుష్ రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ సినిమాపై అంచనాలు అంతకుఅంత పెరిగిపోతున్నాయి.

AdiPurush UpDates: ఆదిపురుష్ రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ సినిమాపై అంచనాలు అంతకుఅంత పెరిగిపోతున్నాయి. రిలీజ్ కు మరో రెండు వారాలు మాత్రమే ఉండడంతో సినిమా అభిమానులే కాదు సినీరంగ ప్రముఖులు సైతం ఆదిపురుష్ అప్ డేట్స్ కోసం ఆరా తీస్తున్నారు. చిత్ర యూనిట్ సైతం ఉత్సాహంగా ప్రమోషనల్ యాక్టివిటీస్ ను నిర్వహిస్తోంది. తాజాగా ఉగ్రరూపంలో ఉన్న హనుమంతుడి పోస్టర్ ను రిలీజ్ చేశారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి మరో అప్ డేట్ కూడా ఇచ్చారు.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 6న తిరుపతిలో నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వేదిక మాత్రం కన్ ఫామ్ చేయలేదు. దీంతో ఎక్కడ నిర్వహించనున్నారని అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. వారి ఎదురు చూపులకు తెర దించుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు మేకర్స్ కన్ ఫామ్ చేశారు. జూన్ 6న సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆదిపురుష్ మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్ - అతుల్ ద్వయం ముంబై నుంచి తిరుపతికి బైక్ పై చేరుకోనున్నారు. మరోవైపు ప్రీ రిలీజ్ వేడుకల్లో భాగంగా ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

ఇక రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఆదిపురుష్ జూన్ 16న విడుదల కానుండగా థియెట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ద్వారా ఇప్పటికే రూ.432 కోట్లను రికవర్ చేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ మూవీ థియెట్రికల్ రైట్స్, జీఎస్టీ మినహా రూ.185 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే సౌత్ లో డిస్ట్రిబ్యూటర్ రికవరీ కోసం ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది. ఇక అన్ని భాషల్లో శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, నాన్ థియెట్రికల్ వసూళ్లు రూ.242 కోట్లు. అంటే వీటన్నింటి బట్టి చూస్తే నిర్మాతలు సేఫ్ గానే ఉన్నారని చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories