"సెబాస్టియన్ పీసీ 524"తో షాక్ అయిన కిరణ్ అబ్బవరం

"సెబాస్టియన్ పీసీ 524"తో షాక్ అయిన కిరణ్ అబ్బవరం

admin1
Updated on: 7 March 2022 2:00 PM IST
Sebastian PC 524 Movie that Disappeared From the Box Office
X

"సెబాస్టియన్ పీసీ 524"తో షాక్ అయిన కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram: ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న యువ హీరోలలో కిరణ్ అబ్బవరం కూడా ఒకడు. ఈ మధ్యనే "ఎస్ ఆర్ కళ్యాణమండపం" అనే సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక తాజాగా "సెబాస్టియన్ పీసీ 524" అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొదట ఈ సినిమాకి కలెక్షన్లు బాగానే అందుకున్నప్పటికీ తరువాత సినిమాకి ఉన్న హైప్ బాగా తగ్గిపోయింది. కొన్ని థియేటర్లలో బి సి సెంటర్ లు కలిపి గ్రాస్ కలెక్షన్లు కేవలం వెయ్యి రెండు వేల రూపాయలు మాత్రమే రావడం అందరినీ షాక్ కి గురి చేసింది.

మంచి సబ్జెక్ట్ తీసుకున్నారని పర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ అని మంచి టాక్ కూడా నడిచింది కానీ సినిమా మాత్రం కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ నుంచి మాయమైపోయింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కిరణ్ బాగానే నటించినప్పటికీ సినిమా కలెక్షన్లు మాత్రం భారీగా నిరాశపరిచాయి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఈ సినిమాతో పాటే విడుదల కావాల్సింది. సినిమా ప్రమోషన్ల సమయంలో కిరణ్ అబ్బవరం తన సినిమా రిలీజ్ అవుతున్నా సరే పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానని చెప్పారు. ఇప్పుడు అభిమానులు తన సినిమా బాలేదని కిరణ్ కి కూడా తెలుసు అని అందుకే "భీమ్లా నాయక్" సినిమా చూస్తానని అన్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

admin1

admin1

Next Story