Kona Venkat: ఎన్టీఆర్‌ ఇంటి ముందు నిరాహార దీక్ష చేసైనా ఆ సీక్వెల్‌ చేస్తా

Screenwriter Kona Venkat Gives Clarity On Jr NTR Adhurs Movie Squale
x

Kona Venkat: ఎన్టీఆర్‌ ఇంటి ముందు నిరాహార దీక్ష చేసైనా ఆ సీక్వెల్‌ చేస్తా

Highlights

Kona Venkat: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో అదుర్స్ మూవీ అతిపెద్ద సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.

Kona Venkat: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో అదుర్స్ మూవీ అతిపెద్ద సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్ అందించిన కథతో డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించడమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. ఇందులో ఎన్టీఆర్‌ డ్యూయల్‌ రోల్‌ ప్లే చేశాడు. చారి పాత్రలో ఎన్టీఆర్‌ పండించిన కామెడీ అంత ఇంతకాదు. ఇంతవరకు ఎప్పుడు ఎన్టీఆర్‌ని ఆ తరహా పాత్రలో చూడలేదు. బ్రహ్మానందం, ఎన్టీఆర్‌ మధ్య వచ్చే సీన్స్‌ సినిమాకే హైలెట్‌. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చారి పాత్రను మరిచిపోరు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు ఎన్టీఆర్‌.

ఈ చిత్రానికి సీక్వెల్‌ వస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. తాజాగా వెంకీకి సీక్వెల్ చేయాలనుకుంటున్నారా అని ఎదురైన ప్రశ్నకు కోన వెంకట్ స్పందించారు. వెంకీ 2 సంగతి తెలియదు కానీ.. అదుర్స్ 2 చేయాలని తాను గట్టిగా నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. అదుర్స్ 2 చిత్రానికి ఎన్టీఆర్‌ను ఒప్పించేందుకు అవసరమైతే ఆయన ఇంటికి ముందు నిరాహార దీక్ష చేస్తానని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories