బాలయ్యతో అఖిల్ హీరోయిన్ !

బాలయ్యతో అఖిల్ హీరోయిన్ !
x
Highlights

అయితే మొదటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.. అందులో భాగంగానే చాలా మంది ముద్దుగుమ్మల పేర్లు బయటికి వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆఫీషియల్ గా ప్రకటన ఎప్పుడు కూడా రాలేదు.

నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం కావడం విశేషం.. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే మొదటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.. అందులో భాగంగానే చాలా మంది ముద్దుగుమ్మల పేర్లు బయటికి వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆఫీషియల్ గా ప్రకటన ఎప్పుడు కూడా రాలేదు. అయితే అందరికి బిగ్ సప్ రైజ్ ఇస్తూ బాలయ్య సినిమాలో అఖిల్ మూవీ ఫేమ్ సయేషా సైగల్ ను ఎంపిక చేశారు మేకర్స్.. ఈ మేరకు చిత్రయూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కుడా ఇచ్చింది. ఈ సెలక్షన్ ఫ్యాన్స్ కి మాత్రం పెద్ద షాకింగ్ గానే ఉంది.

అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది తర్వాత తెలుగులో సయేషా సైగల్.. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ ఆమె మరో సినిమాలో కనిపించలేదు. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కి చెక్కేసింది ఈ భామ.. అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపొయింది.. తెలుగులో వచ్చి మంచి హిట్టైనా భలేభలే మగాడివోయ్ తమిళ్ రీమేక్ గజినీకాంత్‌లో తనతో కలిసి నటించిన ఆర్యను పెళ్లి చేసుకుంది సయేషా.

ఇక అటు దాదాపుగా 50 శాతం కంప్లీట్ చేసుకున్న బాలయ్య, బోయపాటి సినిమా కరోనా వలన వాయిదా పడి తాజాగా మొదలైంది.. ఇక బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారని సమాచారం.


Show Full Article
Print Article
Next Story
More Stories