నందు బోల్డ్ లుక్.. గీతా మాధురి షాక్

నందు బోల్డ్ లుక్.. గీతా మాధురి షాక్
x
Highlights

సింగర్ గీతా మాధురి భర్త నందు అంటే తెలియని వారు ఉండరు. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ ని మొదలు పెట్టిన నందు ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేశాడు.

సింగర్ గీతా మాధురి భర్త నందు అంటే తెలియని వారు ఉండరు. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ ని మొదలు పెట్టిన నందు ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం 'సవారి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. 'బందంరేగడ్' అనే షార్ట్ ఫిలిం తో మంచి ఫేమస్ అయిన సాహిత్ మోత్కూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను ఈ రోజు (బుధవారం) విడుదల చేశారు.

చిత్ర ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో నందు రాజు అనే పాత్రలో పక్కా తెలంగాణ కుర్రాడి కనిపించనున్నాడు. డైలాగ్ డెలివరీ, గెటప్స్ మొత్తం మార్చేసి ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అంతేకాకుండా హీరోయిన్ ప్రియాంక శర్మ కూడా ఆకట్టుకుంది. ఆమె పాత్రకి మంచి ప్రాదాన్యత ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ సినిమాలో బోల్డ్ కామెడీతో పాటు ఎమోషనల్ కంటెంట్, లవ్ కూడా ఉన్నాయి. ఇక చిత్ర ట్రైలర్ చివరలో డ్రాయర్‌లో బోల్డ్‌గా కనిపించాడు హీరో నందు..

అయితే ఈ సినిమా ట్రైలర్ పై హీరో నందు భార్య గీతామాధురి సోషల్ మీడియాలో స్పందిస్తూ ..''లాస్ట్ లో నేను ఎందుకు అంత షాక్ అయ్యానో తెలియాలి అంటే పక్కాగా ఈ లింక్‌ను క్లిక్ చేయాలి. వామ్మో'' అని ట్రైలర్ లింక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రైలర్ మంచి ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి నిర్మించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించారు.. వచ్చే నెల 7 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories