"గాడ్ ఫాదర్" సినిమా స్క్రిప్ట్ విషయంలో సత్యదేవ్ మార్పులు

Satyadevs Changes in Godfather Movie Script | Tollywood News
x

"గాడ్ ఫాదర్" సినిమా స్క్రిప్ట్ విషయంలో సత్యదేవ్ మార్పులు

Highlights

"గాడ్ ఫాదర్" సినిమా స్క్రిప్ట్ విషయంలో సత్యదేవ్ మార్పులు

Satyadev: ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "ఆచార్య" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యపాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుండే థియేటర్ల వద్ద నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాతో డిజాస్టర్ అందుకున్న చిరంజీవి తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "గాడ్ ఫాదర్" పైనే పెట్టుకున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కనుంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో చిరు చెల్లెలి పాత్రలో నయనతార కనిపించనుండగా, ఆమె భర్త మరియు ప్రతినాయకుడి పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ లో సత్యదేవ కొన్ని మార్పులు చేర్పులు చేశారట. చిరంజీవిని ఎలా చూపిస్తే బాగుంటుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా ఇంటర్వెల్ సన్నివేశంలో కొన్ని మార్పులు చెప్పారట.

ఈ నేపథ్యంలో సినిమా ఇంటర్వెల్ సన్నివేశం చాలా బాగా వచ్చిందని సినిమాకి హైలైట్ గా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. సునీల్ మరియు సముద్రఖని కూడా కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఎస్.ఎస్. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. అక్టోబర్ 5 న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్బీ చౌదరి మరియు ఎన్వీ ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories