Thimmarusu : ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్.. నాని అతిధిగా ప్రీ రిలీజ్

Sandeep Reddy
Published on: 27 July 2021 12:17 PM IST
Satyadev Thimmarusu Movie Trailer Launched By Jr NTR And Nani is Chief Guest For Pre Release Event
X

తిమ్మరుసు పోస్టర్ 

Thimmarusu Movie: అసైన్మెంట్ వలి క్రైమ్ థ్రిల్లర్ లో లాయర్ "తిమ్మరుసు" ప్రత్యర్ధుల ఎత్తుగడల నుండి కేసును ఎలా చేధించాడనే కథ కథనంతో సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం యొక్క ట్రైలర్ ని జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశాడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సత్య దేవ్ లాయర్ పాత్రలో నటించగా నటుడు అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ ట్రైలర్ ని విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్రైలర్ లో సత్యదేవ్ నటనకి, సినిమా కథపై ప్రశంసలు కురిపించాడు. సినిమా విడుదలై సూపర్ హిట్ సాధించాలని కోరుకుంటున్నట్లు ఎన్టీఆర్ తెలిపాడు.

ఇక మంగళవారం సాయంత్రం 7 గంటలకు జరగనున్న "తిమ్మరుసు" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరో నాని ముఖ్య అతిధిగా హాజరుకానున్నాడు. కరోన సమయంలో ఓటీటీలో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు దగ్గరైన సత్య దేవ్ తాజాగా తిమ్మరుసును మాత్రం జూలై 30న సినిమా థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తిమ్మరుసు చిత్రం తర్వాత లాక్డ్ 2 వెబ్ సిరీస్ తో పాటు స్కైలాబ్, గాడ్సే, గుర్తుందా శీతాకాలం సినిమాలతో పాటు ప్రొడక్షన్ నెంబర్ 2 తో దర్శకుడు కొరటాల శివ నిర్మాతగా వ్యవహరిస్తున్న మరొక చిత్రంలో హీరోగా నటించబోతున్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story