సత్యదేవ్ ది తొక్కలో సలహా అంటున్న పూరి

సత్యదేవ్ ది తొక్కలో సలహా అంటున్న పూరి

Rama Rao
Updated on: 10 Oct 2022 8:31 PM IST
Satyadev Funny Comments On Puri Jagannadh In Chiranjeevi Godfather Success
X

సత్యదేవ్ ది తొక్కలో సలహా అంటున్న పూరి 

Satyadev: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో సత్యదేవ్ ని ఎంపిక చేసినప్పుడు చాలామంది అలాంటి పాత్రలో అతను సరిపోతాడు అని అనుమానాలు రేకెత్తించారు కానీ సినిమా విడుదలయ్యాక చూస్తే ఆ పాత్రలో సత్యదేవ్ నిజంగా జీవించారని చెప్పుకోవచ్చు. చిరంజీవి కళల్లో కళ్ళు పెట్టి మరీ సత్యదేవ్ మాట్లాడే కొన్ని సన్నివేశాలు బాగా పండాయి. మెగాస్టార్ తో అలాంటి సన్నివేశాలు చేయాలంటే గట్స్ ఉండాలి. ఈ సినిమాతో సత్యదేవ్ అది నిరూపించాడు. అయితే దానికి కొన్ని టెక్నిక్ లు కూడా వాడాడట. చిరంజీవి తో సీన్ అనగానే కళ్లద్దాలు తీసేసేవాడట. ఐ సైట్ ఉండడం సినిమాకి చాలా బాగా కలిసి వచ్చిందని నవ్వేశాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవి మరియు పూరి జగన్నాథ్ సీన్ కూడా సినిమాకి బాగానే ప్లస్ అయింది. పూరి జగన్నాథ్ కూడా తన నటనతో అదరగొట్టాడు. చిరు ముందు ఎలా నటించావు అని పూరి సత్యదేవ్ ను అడగగా, పెద్దాయన కళ్లలోకి కళ్లు పెట్టుకుండా ఉంటే చాలు సీన్ పూర్తయిపోతుంది అని సత్యదేవ్ అన్నాడట. అయితే ఆ మరుసటి రోజు పూరి సత్యదేవ్ కి ఫోన్ చేసి ఇచ్చావ్ లే తొక్కలో సలహా అని పంచ్ వేసాడట. ఇదంతా సరదగా జరిగిన సంభాషణ అని సమాచారం. మరోవైపు "గాడ్ ఫాదర్" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

Rama Rao

Rama Rao

Next Story