Satyadev, Tamannaah : మిల్కీ బ్యూటితో సత్యదేవ్‌.. 'గుర్తుందా శీతాకాలం‌'

Satyadev, Tamannaah : మిల్కీ బ్యూటితో సత్యదేవ్‌.. గుర్తుందా శీతాకాలం‌
x

Tamannaah, Satyadev

Highlights

Satyadev, Tamannaah : తెలుగులో విలక్షమైన నటులు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు.. అందులో ఒకరు సత్యదేవ్.. కెరీర్ మొదటినుంచి మంచి

Satyadev, Tamannaah : తెలుగులో విలక్షమైన నటులు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు.. అందులో ఒకరు సత్యదేవ్.. కెరీర్ మొదటినుంచి మంచి మంచి పాత్రలను చేసుకుంటూ నటుడుగా మంచి గుర్తుంపు తెచ్చుకున్నాడు.. తాజాగా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నాడు.. ఇక ఇప్పుడు మరో సినిమాకి కమిట్ అయ్యాడు సత్యదేవ్‌.. కన్నడ బాషలో సూపర్ డూపర్ హిట్ అయిన 'లవ్‌ మాక్‌టైల్‌' అనే సినిమాని తెలుగులో 'గుర్తుందా శీతాకాలం‌' అనే పేరుతో రీమేక్ చేస్తున్నాడు.. ఈ సినిమాలో సత్యదేవ్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు.

ఇందులో సత్యదేవ్ సరసన మిల్కీ బ్యూటి తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు కన్నడ దర్శకుడు నాగశేఖర్‌ దర్శకత్వం వహించనున్నాడు. ఇక కీరవాణి తనయుడు కాలభైరవ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇంకా షూటింగ్ మొదలు కానీ ఈ సినిమాకి ఓ బంపర్ ఆఫర్ తగిలింది.. ఈ సినిమాకి ఆడియో రైట్స్ ని కన్నడలో మోస్ట్ పాపులర్ అయిన ఆనంద్ ఆడియో కంపెనీ ఏకంగా 75 లక్షలు చెల్లించి కొనుగోలు చేసింది. తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ తో సత్యదేవ్ స్క్రీన్ షేర్ చేసుకోవడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories