Tollywood: సత్యదేవ్, నిత్య మీనన్ "స్కైలాబ్" సినిమా పోస్టర్ విడుదల

Tollywood: తెలుగు సినిమా ప్రధాన పాత్రల్లో నటిస్తూ అటు వెండితెరతో పాటు ఓటీటీ వెబ్ సిరీస్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ

Sandeep Reddy
Published on: 11 July 2021 7:13 PM IST
Satyadev Nithya Menon New Movie Skylab Poster Released Today
X

"స్కైలాబ్" సినిమా పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)

Tollywood: తెలుగు సినిమా ప్రధాన పాత్రల్లో నటిస్తూ అటు వెండితెరతో పాటు ఓటీటీ వెబ్ సిరీస్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న సత్యదేవ్ తాజాగా దర్శకుడు విశ్వక్ ఖండేరావుతో దర్శకత్వంలో "స్కైలాబ్" అనే చిత్రంలో నటిస్తున్నాడు. హీరోయిన్ నిత్య మీనన్, ప్రముఖ హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. అర్జున్ రెడ్డి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి చిత్రాలను నిర్మించిన కెఎఫ్‌సి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో "స్కైలాబ్" చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ విడుదల చేసింది .

1979లో జరిగిన "స్కైలాబ్" సంఘటన ఆధారంగా అప్పటి పరిస్థితులను ఈ సినిమాలో వివరించనున్నారు. ఒక విభిన్నమైన కథతో రాబోతున్న ఈ చిత్రం యొక్క పోస్టర్ కూడా నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం తిమ్మరుసు, గాడ్సే, గుర్తుందా శీతాకాలం, తాజాగా "స్కైలాబ్" వంటి చిత్రాలతో నటుడు సత్యదేవ్ తెలుగు ప్రేక్షకుల ముందకు రాబోతున్నాడు. స్టార్ హీరోలకు పోటీగా సినిమాలతో బిజీగా ఉన్న సత్యదేవ్ మరి ఈ చిత్రాలను వెండితెరపై విడుదల చేయనున్నాడా లేదా తనకి ఇప్పటికే మంచి హిట్లు ఇచ్చిన ఓటీటీలో విడుదల చేసి ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story