Sathyaraj: నాకు ఆ పాత్ర నచ్చలేదు.. ఆయనపై అభిమానంతోనే సినిమా ఒప్పుకున్నా..

Sathyaraj: ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల లో సత్యరాజ్ కూడా ఒకరు.

Arun Chilukuri
Updated on: 7 Jun 2022 6:46 PM IST
Sathyaraj was Hesitant to do Chennai Express
X

Sathyaraj: నాకు ఆ పాత్ర నచ్చలేదు.. ఆయనపై అభిమానంతోనే సినిమా ఒప్పుకున్నా..

Sathyaraj: ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల లో సత్యరాజ్ కూడా ఒకరు. తండ్రి పాత్ర నుంచి విలన్ పాత్ర దాకా ఇప్పటికే సత్యరాజ్ పలు విభిన్న పాత్రలను పోషించి అందరి దృష్టిని ఆకర్షించారు. తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ సత్యరాజ్ అభిమానుల మన్ననలు పొందారు. ముఖ్యంగా బాహుబలిలో సత్యరాజ్ పోషించిన పాత్ర ను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సత్యరాజ్ ఒక సినిమాలో తన పాత్ర తనకి అస్సలు నచ్చక పోయినప్పటికీ తాను ఆ సినిమాలో నటించానని అన్నారు. ఆ సినిమానే చెన్నై ఎక్స్ప్రెస్. 2013లో షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పడుకొనే హీరోయిన్గా రోహిత్ శెట్టి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిందీ సినిమా "చెన్నై ఎక్స్ప్రెస్". ఆ సినిమాలో సత్యరాజ్ దీపికా పడుకొని తండ్రి పాత్రలో కనిపించారు. చిత్ర డైరెక్టర్ రోహిత్ శెట్టి మొట్టమొదటిసారిగా తనను సంప్రదించినప్పుడు తన పాత్ర తనకి ఏమాత్రం నచ్చలేదని సత్యరాజ్ డైరెక్టర్ కి చెప్పేశారట.

కానీ షారుక్ మీద ఉన్న అభిమానంతో మాత్రమే ఆ సినిమాకి ఒప్పుకున్నట్లు తెలిపారు సత్యరాజ్. షారుక్ ఖాన్ నటించిన "దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే" సినిమా తనకు చాలా ఇష్టమని ఆ సినిమాని ఇప్పటికే చాలాసార్లు చూశాను అని చెప్పారు సత్యరాజ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story