Radhe Shyam: మరొకసారి ప్రభాస్ సినిమాలో కనిపించనున్న కట్టప్ప

admin1
Updated on: 22 Aug 2021 1:30 PM IST
Sathyaraj Playing Key Role in Prabhas Radhe Shyam Movie
X

ప్రభాస్ - సత్యరాజ్ (ఫైల్ ఫోటో)

Prabhas - Sathyaraj: టాలీవుడ్ లో మంచి పేరు ఉన్న సత్య రాజ్ కు తెలుగులో మంచి పేరు లభించడానికి కారణం ప్రభాస్ సినిమాలు అని చెప్పుకోవచ్చు. తమిళంలో లో పాపులర్ నటుడైన సత్యరాజ్ తెలుగులో "మిర్చి" సినిమా తో అభిమానుల మనసులను గెలుచుకున్నారు. ఆ సినిమాలో ప్రభాస్ తండ్రిగా సత్య రాజ్ నటన సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ ప్రభాస్ హీరోగా నటించిన "బాహుబలి" సినిమాలో సత్యరాజ్ ఓ ముఖ్య పాత్ర పోషించారు. కట్టప్ప పాత్రలో సత్య రాజ్ ఒదిగి పోయి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు తాజాగా మరొక సారి ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

"జిల్" ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ మరియు పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తాజాగా సత్యరాజ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కడపలోని గండికోట వద్ద జరుగుతోంది. ఈ సినిమాలో కూడా సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. 1970 ఇటలీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఒక ఫాంటసీ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యు.వి.క్రియేషన్స్ మరియు టి.సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతోంది.

admin1

admin1

Next Story