Sashi Movie OTT: ఓటీటీలో 'శశి' మూవీ రిలీజ్

Aadi Sashi Movie
x

Sashi Movie File image

Highlights

Sashi Movie OTT: ఒకే ఒక లోకం నువ్వే..లోకంలోన అందం నువ్వే.. అంటూ సిద్ శ్రీరామ్ ఆలపించిన గీతం

Sashi Movie OTT: ఒకే ఒక లోకం నువ్వే..లోకంలోన అందం నువ్వే.. అంటూ సిద్ శ్రీరామ్ ఆలపించిన గీతం మూడు నెలల క్రితం యూట్యూబ్‌ని షేక్ చేసింది. ఈ పాట చాలామంది కాలర్ ట్యూన్స్‌గా కూడా వినిపించింది. ఈ పాట సంగీత ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అరుణ్‌ చివులూరు బాణీలు కట్టిన ఈ పాట ఆది, సురభి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'శశి'. ఈ చిత్రంలోనిదే సాంగ్. ఇప్పుడు శశి మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

రాశీసింగ్‌, జయప్రకాశ్‌, రాజీవ్‌కనకాల కీలక పాత్రలు పోషించింన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో విడుదలైన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులోని డైలాగ్స్, సాంగ్స్ యూత్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ చిత్రం శ్రీనివాస్‌ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కింది. ఆర్‌.పి.వర్మ, చావలి రామాంజనేయులు, చింతలపూరి శ్రీనివాస్‌రావు నిర్మించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories