మహేష్ బాబు కోసం 8 భారీ సెట్స్

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో ఫారెన్ వెకేషన్ లో బిజీగా ఉన్నారు...

Shireesha
Updated on: 28 April 2022 2:42 PM IST
Sarkaru Vaari Paata Team Made Bank Sets for Mahesh Babu Shoot | Keerthy Suresh
X

మహేష్ బాబు కోసం బ్యాంక్ సెట్స్ వేసిన చిత్రబృందం... 

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో ఫారెన్ వెకేషన్ లో బిజీగా ఉన్నారు. ఇక సినిమాల పరంగా త్వరలోనే మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో నటించిన "సర్కారు వారి పాట" సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన ఎస్ ప్రకాష్ ఈ సినిమా బ్యాంకింగ్ సిస్టం చుట్టూ తిరుగుతుందని తెలియజేశారు.

అయితే ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ కోసం చిత్రబృందం పలుచోట్ల 8 బ్యాంక్ సెట్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే సినిమాకోసం మోడర్న్ బ్యాంక్ లను కాకుండా వింటేజ్ బ్యాంక్ సెట్స్ తయారు చేశారట. నిజానికి ఈ సినిమా షూటింగ్ ను దర్శకనిర్మాతలు గోవాలో ప్లాన్ చేసారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల హైదరాబాద్ లోనే షూటింగ్ చేయాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో పలు బ్యాంక్ సెట్స్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ డిజైన్ల కోసం చిత్రబృందం చాలా కష్ట పడినట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు చాలావరకు ఇండోర్ షూటింగ్ లను ఇష్టపడతారని అందరికీ తెలిసిందే. అందుకే లోకల్ లో ఇలాంటి సెట్స్ ను నిర్మించింది చిత్రబృందం.

Shireesha

Shireesha

Next Story