Mahesh Babu: ఓటీటీలో సర్కారు వారి పాట.. కానీ..

Sarkaru Vaari Paata Starts Streaming on Amazon Prime
x

Mahesh Babu: ఓటీటీలో సర్కారు వారి పాట.. కానీ..

Highlights

Sarkaru Vaari Paata In OTT: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "సర్కారు వారి పాట".

Sarkaru Vaari Paata In OTT: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "సర్కారు వారి పాట". పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య మే 12న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇక ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్న వారికి అమెజాన్‌ ప్రైమ్‌ తీపి కబురు చెప్పింది. పే-పర్‌-వ్యూ పద్దతిలో సర్కారు వారి పాటను స్ట్రీమింగ్‌ చేస్తోంది అమెజాన్‌.

రూ.199 చెల్లించి సినిమాను చూడొచ్చు. ఇటీవల కేజీఎఫ్ 2 చిత్రాన్ని ఇలాగా రెంటల్ విధానంలో విడుదల చేశారు. కొద్ది రోజుల తర్వాత సాధారణ చందాదారులకు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు సర్కారువారి పాట చిత్రానికి కూడా అదే విధానాన్ని అమలు చేస్తున్నారని అర్ధమవుతోంది. థియేటర్స్ లో ఇంకా ఆడుతున్న ఈ సినిమాకి డిజిటల్ ప్లాట్ పామ్ పై ఎలాంటి స్పందన లభిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. మరి ఈ సినిమాను పే ఫర్ వ్యూ విధానంలో ఎంత మంది వీక్షిస్తారో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories