Sarkaru Vaari Paata: మహేశ్ అభిమానులకు గుడ్ న్యూస్.. 'సర్కారు వారి పాట' విడుదల తేదీ ఖరారు

సూపర్ స్టార్ మహేశ్ అభిమానులకు గుడ్ న్యూస్. స్టార్‌ డైరెక్టర్‌ పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్నచిత్రం సర్కారు వారి పాట.

Samba Siva Rao
Published on: 29 Jan 2021 5:13 PM IST
Sarkaru Vaari Paata: మహేశ్ అభిమానులకు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట విడుదల తేదీ ఖరారు
X

 సర్కారు వారి పాట

సూపర్ స్టార్ మహేశ్ అభిమానులకు గుడ్ న్యూస్. స్టార్‌ డైరెక్టర్‌ పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్నచిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఎప్పుడు విడుదల చేయబోయేది మూవీ యూనిట్ ప్రకటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట విడుదల చేయనున్నటు ప్రకటించారు. దీంతో మహేశ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో దిగేందుకు పందెంకోడి సిద్దమవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

14 రీల్స్‌ ప్లస్‌, మైత్రి మూవీ మేరర్స్, మహేశ్‌బాబు ఎంటర్ టైమ్మెంట్స్, నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్ సరసన 'మహానటి' కీర్తి సురేశ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సక్సెస్‌ల తర్వాత మహేశ్‌ నటిస్తోన్న చిత్రం కావడంతో సర్కారు వారి పాట మీద భారీ అంచనాలే నెలకొన్నాయి.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story