భారీ స్థాయిలో విడుదల కాబోతున్న మహేష్ బాబు సినిమా

Sarkaru Vaari Paata Movie to Be Released on Pan Indian Film
x

భారీ స్థాయిలో విడుదల కాబోతున్న మహేష్ బాబు సినిమా

Highlights

భారీ స్థాయిలో విడుదల కాబోతున్న మహేష్ బాబు సినిమా

Sarkaru Vaari Paata: "సరిలేరు నీకెవ్వరు" సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ డైరెక్షన్లో "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఈ మధ్యనే విడుదలైన 'కళావతి' పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ని ప్యాన్ ఇండియన్ రేంజ్లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా తమిళ్ రిలీజ్ ఫిక్స్ అయింది.

ఇక ఈ సినిమాని తెలుగు, తమిళ మాత్రమే కాక మిగతా సౌతిండియన్ భాషల్లో కూడా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేస్తారా అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ సినిమా ఈ ఏడాది మే 12న థియేటర్లలో విడుదల కాబోతోంది. సముద్రఖని, వెన్నెల కిషోర్, తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories