మళ్లీ వాయిదా పడనున్న "సర్కారు వారి పాట"

Sarkaru Vaari Paata: మే నుంచి తప్పుకోనున్న "సర్కారు వారి పాట"

admin1
Updated on: 12 April 2022 9:00 PM IST
Sarkaru Vaari Paata Movie to be Postponed Again | Tollywood News
X

మళ్లీ వాయిదా పడనున్న "సర్కారు వారి పాట" 

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "సర్కార్ వారి పాట" సినిమా సెట్స్ పైకి వెళ్లి చాలా కాలం అయింది కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయని దీంతో మహేష్ బాబు స్వయంగా స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి కొన్ని మార్పులు చేర్పులు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఈ సినిమాని మే 12 న విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అప్పుడు కూడా విడుదలయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన పనులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని, ఇంకా కొన్ని సన్నివేశాల షూటింగ్ మరియు పాచ్ వర్క్ కూడా మిగిలి ఉందని అందుకే సినిమా అనుకున్న తేదీకి విడుదలయ్యే అవకాశాలు లేవని కొందరు చెబుతున్నారు.

మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా సినిమాకి సంబంధించిన ప్రమోషన్ పనులు ఇంకా మొదలు పెట్టలేదు. దీంతో "సర్కారు వారి పాట" సినిమా ప్రస్తుతానికి వాయిదా పడుతుందని ఇక సినిమాకి సంబంధించిన మిగిలిపోయిన సన్నివేశాల షూటింగ్ పూర్తయిన తర్వాతే విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన వస్తుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

admin1

admin1

Next Story