మహేష్ బాబు తర్వాత నాగచైతన్య తోనే సినిమా అంటున్న పరశురామ్

admin1
Updated on: 24 Aug 2021 5:30 PM IST
Sarkaru Vaari Paata Director Parsuram New Movie with Hero Naga Chaitanya
X

నాగ చైతన్య - పరశురామ్ (ఫైల్ ఫోటో)

Naga Chaitanya New Movie: దర్శకుడు పరశురామ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పరశురాం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక కథ చెప్పి ఇంప్రెస్ చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో పరశురామ్ దర్శకుడిగా అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటి పై అధికారిక ప్రకటన రాకముందే ఒక వార్త అక్కినేని అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా ఒక సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. అయితే వీటిపై కూడా క్లారిటీ వచ్చే ముందే మధ్యలోకి మహేష్ బాబు వచ్చారు. పరశురామ్, నాగ చైతన్య మూవీ అటకెక్కింది అని కొందరు కామెంట్లు చేశారు.

కొందరు "సర్కారు వారి పాట" సినిమా తరువాత పరశురామ్ బన్నీతో ఒక సినిమా చేస్తున్నారు కానీ నాగచైతన్యతో చేసే సినిమా మాత్రం క్యాన్సిల్ అయిపోయినట్లే అని చెప్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం "సర్కారు వారి పాట" సినిమా తర్వాత పరశురామ్ చేయబోయే సినిమా నాగచైతన్య తోనే అని విశ్వసనీయవర్గాల సమాచారం. ఒక బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకి ఈ సినిమా కచ్చితంగా ఉపయోగపడుతుందని, ఎందుకంటే "సర్కారు వారి పాట" సినిమా తరువాత క్రేజ్ బాగా పెరుగుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో విడుదల కాబోతోంది.

admin1

admin1

Next Story