'సర్కారు వారి పాట' సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంత అంటే..

Sarkaru Vaari Paata Completed Censor Formalities
x

‘సర్కారు వారి పాట’ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంత అంటే..

Highlights

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సర్కారు వారి పాట".

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సర్కారు వారి పాట". మహానటి బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ తో బయటకు వచ్చింది.

అంతేకాదు, రన్ టైమ్ కూడా లాక్ అయినట్టు తెలుస్తోంది. 2 గంటల 42నిమిషాల నిడివితో సర్కారు వారి పాట సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం. సినిమాకి సంబంధించి పెద్దగా కట్స్ లేనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories