Sarkaru Vaari Paata - Bheemla Nayak: ఈ రెండు సినిమాల విడుదల తేదీలు ఇదేనా

*మార్చ్ మరియు ఏప్రిల్ లో విడుదల కాబోతున్న పవర్ స్టార్ మరియు సూపర్ స్టార్ సినిమాలు

admin1
Updated on: 25 Oct 2021 3:10 PM IST
Sarkaru Vaari Paata and Bheemla Nayak Movies Release Dates Fixed
X

మార్చ్ మరియు ఏప్రిల్ లో విడుదల కాబోతున్న పవర్ స్టార్ మరియు సూపర్ స్టార్ సినిమాలు(ఫైల్ ఫోటో)

Sarkaru Vaari Paata - Bheemla Nayak Release Dates: థియేటర్లు రీ ఓపెన్ అయ్యి ఇప్పటికే పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద సినిమా నిర్మాతలు కూడా తమ సినిమాలను విడుదల చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇక అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "సర్కారు వారి పాట".

పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక పొలిటికల్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 25న వేసవిలో విడుదల కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న "భీమ్లా నాయక్" సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళంలో సూపర్ హిట్టయిన "అయ్యప్పనుమ్ కోషియుం" సినిమాకి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "భీమ్లా నాయక్" వచ్చే ఏడాది మార్చి 31న థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిత్య మీనన్ మరియు సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాలు విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కాబోతోంది.

admin1

admin1

Next Story