"సర్కారు వారి పాట" అల్లు అర్జున్ కోసం రాసిన కథ?

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సర్కారు వారి పాట".

Arun Chilukuri
Published on: 9 May 2022 6:24 PM IST
Sarkaru Vaari Paata Allu Arjun Rejected And Mahesh Babu Accepted?
X

"సర్కారు వారి పాట" అల్లు అర్జున్ కోసం రాసిన కథ?

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సర్కారు వారి పాట". పరశురామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో నిజానికి వేరే హీరో నటించాల్సి ఉందట. నిజానికి ఈ కథని అల్లు అర్జున్ కోసం రాశారట కానీ బన్నీ ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. నిజానికి పరశురామ్ గీత ఆర్ట్స్ నిర్మాణంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అప్పటికే శ్రీరస్తు శుభమస్తు గీతగోవిందం సినిమాలు చేసిన పరశురామ్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నారు.

కానీ కొన్ని కారణాల వల్ల అది వర్కవుట్ అవ్వలేదు. ఆ తర్వాత మహేష్ బాబు ఈ సినిమా కథని ఓకే చేశారు. మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ముందుగా గీత ఆర్ట్స్ వారు నిర్మించాల్సి ఉంది. కానీ గీతా ఆర్ట్స్ తప్పుకోగా వేరే ప్రొడ్యూసర్లు ఈ సినిమా బాధ్యతను తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ అల్లు అర్జున్ కోసం రాసుకున్నట్టు ఉంటుంది అని అడిగితే మాత్రం ఈ సినిమా మహేష్ బాబు కోసమే రాశాను అని క్లారిటీ ఇస్తున్నారు. "గీత గోవిందం సినిమా తర్వాతే నేను మహేష్ బాబు గారిని కలిసి ఈ సినిమా లైన్ ని చెప్పాను. ఆయనకి బాగా నచ్చింది. ఆ తరువాతే స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టాను" అని అన్న పరశురామ్ సినిమా అల్లు అర్జున్ కోసం రాసింది కాదని కేవలం మహేష్ బాబు ని దృష్టిలో పెట్టుకుని రాసిన కథ అని చెప్పుకొచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story