Saranga Dariya: 50 మిలియన్ వ్యూస్.. 14 రోజుల్లోనే సారంగదరియా రికార్డ్

Saranga Dariya Song: నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’.

Venkata Chari
Published on: 15 March 2021 7:45 PM IST
Saranga Dariya: 50 మిలియన్ వ్యూస్.. 14 రోజుల్లోనే సారంగదరియా రికార్డ్
X

Saranga Dariya Song: అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ప్రేమ కావ్యం 'లవ్ స్టోరీ'. విడుదలకు ముందే ఈ సినిమా సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది. రెండువారాల కిందట విడుదలైన 'సారంగదరియా' సాంగ్ యూట్యూబ్ లో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ మరో రికార్డు క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన 14 రోజుల్లోనే యూట్యూబ్‏లో 50 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. ఇప్పటివరకు ఇంత తక్కువ టైంలో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఫస్ట్ సాంగ్‌గా సారంగదరియా నిలిచింది.

సారంగదరియా సాంగ్ అక్కినేని సమంత చేతుల మీదుగా ఫిబ్రవరి 28న విడుదలైంది. ఈ సాంగ్ కంటే ముందు తమిళంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన మారి 2లోని "రౌడీ బేబి" సాంగ్ కేవలం 8 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆ సినిమాలో హీరోగా ధనుష్ నటించాడు. ఇక తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన అల… వైకుంఠపురం సినిమాలోని బుట్టబోమ్మ, రాములో రాములా సాంగ్స్ ను సారంగదరియా వెనకకు నెట్టింది. బుట్ట బోమ్మ సాంగ్‌ 18 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయగా.. రాములో రాములా పాటకు 27 రోజులు పట్టింది.

ఇక ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా.. మంగ్లీ పాడింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Venkata Chari

Venkata Chari

Next Story