Saranga Dariya: ముగిసిన వివాదం.. శేఖర్ కమ్ములను కలిసిన కోమలి

Saranga Dariya: శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్‌స్టోరీ’ లోని ‘సారంగ దరియా’ పాటపై నెలకొన్న వివాదం తెలిసిందే.

Venkata Chari
Published on: 17 March 2021 9:19 PM IST
Saranga Dariya Komali Met Director Sekhar Kammula
X

శేఖర్ కమ్ములను కలిసిన కోమలి

Saranga Dariya: శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్‌స్టోరీ' సినిమాలోని 'సారంగ దరియా' పాటపై నెలకొన్న వివాదం తెలిసిందే. కొంతకాలంగా సాగుతున్న వివాదానికి ఎట్టకేలకు ముగింపు దొరికింది. జానపద గాయని కోమలి డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ములను బుధవారం కలిసింది.

ఈ సందర్భంగా కోమలి మాట్లాడుతూ.. నా పాట నేనే పాడాలని ఆశించాను. నన్ను రేలారే రేలా కు తీసుకొచ్చిన మా గురువు సురేశ్‌ సహాయంతో డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ములగారిని కలిశాను. తన తర్వాతి సినిమాలో నాకు పాడే అవకాశం ఇస్తానని ఆయన చెప్పారు. అవసరమైతే ఆడియో ఫంక్షన్‌ లో కూడా అచ్చమైన పల్లెగొంతును వినిపిస్తామని అన్నారు. ఈ 'సారంగదరియా' పాటపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు'' అని ఆమె చెప్పింది.

అనంతరం శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ.. కమ్యూనికేషన్‌ లేకపోవడం వల్లే కోమలి తనను ఇంతకాలం కలవలేదన్నారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story