న్యూ ఏజ్ ప్రేమ కథతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న సంతోష్ శోభన్

న్యూ ఏజ్ ప్రేమ కథతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న సంతోష్ శోభన్
x

న్యూ ఏజ్ ప్రేమ కథతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న సంతోష్ శోభన్

Highlights

Santosh Sobhan: ఎమోషనల్ ప్రేమ కథ తో "పేపర్ బాయ్" హిట్ అందుకుంటాడా?

Santosh Sobhan: "పేపర్ బాయ్" వంటి మంచి ఎమోషనల్ ప్రేమ కథతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన సంతోష్ శోభన్ ఒక మంచి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన "ఏక్ మినీ కథ" సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఇంకా సంతోష్ శోభన్ ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ మాత్రం అందుకోలేకపోయాడు. ఇక ఈ మధ్యనే "మంచి రోజులొచ్చాయి" సినిమా కూడా సంతోష్ శోభన్ కి మంచి రోజులు తీసుకురాలేకపోయాయి.

ఇక తన ఆశలన్నీ "లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్" పైన పెట్టుకున్నాడు కానీ ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోయింది. తాజాగా ఇప్పుడు సంతోష్ శోభన్ "కల్యాణం కమనీయం" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ చూస్తే బాలీవుడ్లో అర్జున్ కపూర్ మరియు కరీనాకపూర్లు నటించిన "కి అండ్ కా" సినిమా లాగా అనిపిస్తుంది.

అంతేకాకుండా హీరోయిన్ వల్ల హీరోకి జాబ్ దొరకడం "7/జీ బృందావన్ కాలనీ" సినిమాని కూడా ప్రేక్షకులకు గుర్తుచేస్తుంది. న్యూ ఏజ్ ప్రేమ కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. కానీ ఈ సినిమా తో సంతోష్ శోభన్ ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తాడో లేదో వేచి చూడాలి. ప్రియ భవాని శంకర్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ కాన్సెప్ట్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories