మళ్లీ రిపీట్ అవ్వనున్న "ఏక్ మినీ కథ" కాంబో

Santosh Sobhan: మళ్లీ రిపీట్ అవ్వనున్న "ఏక్ మినీ కథ" కాంబో

Jyothi
Updated on: 9 Jun 2022 4:30 PM IST
Santosh Shobhan Again Under The Direction Of Merlapaka Gandhi
X

మళ్లీ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సంతోష్ శోభన్

Santosh Sobhan: "తాను నేను" అనే సినిమాతో హీరోగా మారిన సంతోష్ శోభన్ "పేపర్ బాయ్" సినిమా తో మంచి విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన "ఏక్ మినీ కథ" అనే సినిమాతో తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు సంతోష్. ఈ మధ్యనే "మంచిరోజులొచ్చాయి" అనే సినిమాతో కూడా మెప్పించిన సంతోష్ ఇప్పుడు మరొక సినిమాని సైన్ చేశారు. "ఏక్ మినీ కథ" సినిమా కి దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ డైరెక్షన్లో సంతోష్ మరొక సినిమా కి సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. చాలా సింపుల్ కథ తో విడుదలైన "ఏక్ మినీ కథ" ప్రేక్షకులను బాగానే మెప్పించింది.

ఈ నేపథ్యంలో సంతోష్ శోభన్ మేర్లపాక గాంధీ కాంబో లో రాబోతున్న రెండవ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. యువి కాన్సెప్ట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఒక వెరైటీ టైటిల్ ను ఖరారు చేసినట్లుగా సమాచారం. ఈ సినిమాకి "లైక్ షేర్ సబ్స్క్రైబ్" అనే టైటిల్ ని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక టైటిల్ కి తగ్గట్టే ఈ సినిమా కథ కూడా సోషల్ మీడియా చుట్టూనే తిరుగుతుంది అని సంతోష్ ఈ సినిమాలో ఒక యూట్యూబర్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. కంటెంట్ కి తంబ్ నైల్ కి సంబంధం లేకుండా చాలా మంది కేవలం వ్యూస్ కోసం యూట్యూబ్ లో వీడియోలు పెట్టే వారిపై సెటైర్లు కూడా ఈ సినిమాలో ఉంటాయని సమాచారం.

Jyothi

Jyothi

Next Story