"నేను విన్న కథలలో దసరా బెస్ట్" అంటున్న మ్యూజిక్ డైరెక్టర్

* నాని దసరా సినిమాని ఆకాశానికి ఎత్తేసిన సంతోష్ నారాయణన్

Dhatripriya
Updated on: 6 March 2023 6:31 PM IST
Santhosh Narayanan Says Dasara Movie Is Best Movie
X

"నేను విన్న కథలలో దసరా బెస్ట్" అంటున్న మ్యూజిక్ డైరెక్టర్

Santhosh Narayanan: నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న "దసరా" సినిమా త్వరలోనే విడుదలకి సిద్ధమవుతోంది. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే తన రెస్టిక్ లుక్కుతో ప్రేక్షకులను అలరిస్తున్న నాని ఈ సినిమాతో కచ్చితంగా హిట్ అందుకుంటాడని అభిమానులు చెబుతున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈనెల 30వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

తాజాగా ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యు లో మాట్లాడుతూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. "గత పది ఏళ్లలో నేను 90 దాకా తెలుగులో స్క్రిప్ట్ లు విని ఉంటాను. కానీ వాటి అన్నిటిలోనూ దసరా బెస్ట్ ఫిలిం అని నేను చెప్పగలను. అలాంటి దసరా సినిమాని ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకోనే రోజు కోసం ఎదురుచూస్తున్నాను," అని అన్నారు సంతోష్ నారాయణన్.

ఇక డైరెక్టర్ శ్రీకాంత్ గురించి మాట్లాడుతూ తమిళ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ ఫిలిం మేకింగ్ మరియు శ్రీకాంత్ ఫిలిం మేకింగ్ కొంత ఒకేలా ఉంటుందని అన్నారు. "వెండితెరపై ఆర్ట్ ఫామ్ ని రా గా ప్రజెంట్ చేసే ఫిలిం మేకర్స్ తమిళ్లో చాలామంది ఉన్నారు. కానీ తెలుగులో కొంతమంది మాత్రమే ఉన్నారు. శ్రీకాంత్ ఆ కొంత మందిలో ఒకరు," అని చెప్పుకొచ్చారు సంతోష్ నారాయణన్.

Dhatripriya

Dhatripriya

Next Story