Sreekaram Movie : 'సంక్రాంతి సందళ్లే'.. శ‌ర్వానంద్ 'శ్రీ‌కారం' నుంచి అద్భుతమైన పాట

Sreekaram Movie : సంక్రాంతి సందళ్లే.. శ‌ర్వానంద్ శ్రీ‌కారం నుంచి అద్భుతమైన పాట
x
Highlights

యంగ్ హీరో శ‌ర్వానంద్ ప్రధానపాత్రలో న‌టిస్తోన్న తాజా సినిమా 'శ్రీ‌కారం'‌. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి కిశోర్. బి దర్శకత్వం...

యంగ్ హీరో శ‌ర్వానంద్ ప్రధానపాత్రలో న‌టిస్తోన్న తాజా సినిమా 'శ్రీ‌కారం'‌. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి కిశోర్. బి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుద‌ల చేసిన తొలి పాట 'బ‌లేగుంది బాలా'కు సంగీత ప్రియుల నుంచి అలరిస్తోంది. పెంచ‌ల్ దాస్ రచించి, పాడిన ఈ పాట‌కు 22 మిలియ‌న్స్ పైగా వ్యూస్ రావ‌డం గమనార్హం. గురువారం ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు. 'సంద‌ళ్లే సంద‌ళ్లే సంక్రాంతి సంద‌ళ్లే'అంటూ సాగే ఈ పాట‌లో సాహిత్యం అందరినీ కట్టిపడేస్తోంది. ఈ పాటకు లీరిక్స్ సానపాటి భరద్వాజ్ పాత్రుడు అందించాడు. మిక్కీ జే మేయ‌ర్ బాణీలు, అనురాగ్ కుల‌క‌ర్ణి - మోహ‌న భోగ‌రాజు గానం ఈ పాటకు ప్రధానాకర్షణగా నిలిచింది.

ఈ పాటను వింటున్నచూస్తున్నా సంక్రాంతి పండుగ సంద‌డి అప్పుడే మొదలైందా అని అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయ‌ర్ మెలోడీ ట్యూన్స్ క‌ట్టడంలో మేటని మరోసారి నిరుపించాడు. యువ‌రాజ్ సూప‌ర్బ్ సినిమాటోగ్రఫీతో చిత్రీక‌ర‌ణ ప‌రంగానూ ఈ పాట అమితంగా ఆక‌ట్టుకుంటోంది. హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహ‌న్ న‌టిస్తున్నారు. 14 ప్లస్ రీల్స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శోభి కొరియోగ్రఫీ అందించారు. రావు ర‌మేష్‌, ఆమ‌ని, న‌రేష్‌, సాయికుమార్‌, ముర‌ళీ శ‌ర్మ, స‌త్య, స‌ప్తగిరి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 'గ‌ద్దల‌కొండ గ‌ణేష్' వంటి బ్లాక్‌ బ‌స్టర్ హిట్ త‌ర్వాత 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ నుంచి వ‌స్తోన్న రెండో చిత్రం 'శ్రీ‌కారం' కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories