Jigrees: చిన్న సినిమాకు పెద్ద సపోర్టు.. జిగ్రీస్ మూవీ సినిమాపై సందీప్ రెడ్డి వంగ ప్రశంసలు

Jigrees: చిన్న సినిమాకు పెద్ద సపోర్టు.. జిగ్రీస్ మూవీ సినిమాపై సందీప్ రెడ్డి వంగ ప్రశంసలు
x
Highlights

Jigrees: అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సెన్సేషనల్ మూవీలతో భారతదేశంలోనే స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఒక చిన్న సినిమా అయిన జిగ్రీస్ కు మద్దతుగా నిలిచారు.

Jigrees: అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సెన్సేషనల్ మూవీలతో భారతదేశంలోనే స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఒక చిన్న సినిమా అయిన జిగ్రీస్ కు మద్దతుగా నిలిచారు. తన చిన్ననాటి స్నేహితుడు కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. జిగ్రీస్ సినిమా విజువల్స్, కామెడీ, మ్యూజిక్ పై సందీప్ వంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యానిమల్ షూటింగ్ గ్యాప్‌లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు, నిర్మాత కృష్ణ వోడపల్లి ఈ సినిమాలోని కొన్ని విజువల్స్ చూపించారని, అవి తనను బాగా ఇంప్రెస్ చేశాయని వంగా చెప్పారు. బూతులు లేకుండా సమకాలీన హాస్యాన్ని రాసి, తీయడం ఈ రోజుల్లో చాలా కష్టం. కానీ దర్శకుడు ఉప్పుల హరీష్ రెడ్డి ఆ పనిని చాలా బాగా చేశారని ఆయన ప్రశంసించారు. అలాగే, సంగీత దర్శకుడు కమ్రాన్ సయ్యద్ సంగీతం కూడా విజువల్స్‌కు బాగా సూట్ అయిందని, సినిమాలో మూడు నుంచి నాలుగు పాటలు త్వరలోనే విడుదల అవుతాయని తెలిపారు.

సందీప్ వంగా జిగ్రీస్ నిర్మాత కృష్ణ వోడపల్లి తన చిన్ననాటి స్నేహితుడు అని వెల్లడించారు. తాను ప్రొడక్షన్ గురించి చెప్పి ఉంటే కృష్ణ ఈ సినిమా తీసేవాడు కాదని, అందుకే తనకు చెప్పకుండానే సినిమాను స్టార్ట్ చేశాడని సరదాగా పేర్కొన్నారు. స్నేహితుడి సినిమాకు ప్రచారం చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. తెలుగు ఆడియన్స్‌కు క్వాలిటీ సినిమా పట్ల ఎంతో గౌరవం ఉందని, జిగ్రీస్ లో కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా భారీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జిగ్రీస్ సినిమా షూటింగ్‌లో చిత్ర బృందం పడిన కష్టాన్ని కూడా సందీప్ వంగా ప్రస్తావించారు. గోవా, మహారాష్ట్ర సరిహద్దుల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు పోలీసులు పట్టుకోవడం వంటి సవాళ్లను ఎదుర్కొన్నారని వివరించారు. ఇంత కష్టపడి, రిస్క్ తీసుకుని సినిమా తీసిన టీమ్‌కు తప్పకుండా విజయం దక్కుతుందని ఆకాంక్షించారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దామని చెప్పారు. జిగ్రీస్ సినిమాను మీ స్నేహితులతో కలిసి థియేటర్లలో చూడాలని సందీప్ వంగా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories