Animal Movie: సందీప్ వంగా "యానిమల్" సినిమా ను పక్కకి పెట్టడానికి కారణం ఇదేనా?

* ప్రభాస్ సినిమా కోసం "యానిమల్" డిలే చేస్తున్న సందీప్ వంగ

admin1
Updated on: 22 Nov 2021 3:16 PM IST
Sandeep Reddy Vanga Stopped the Animal Movie Shooting to Shoot Prabhas Spirit Movie
X

సందీప్ రెడ్డి వంగా (ఫైల్ ఫోటో)

Sandeep Reddy Vanga - Animal Movie: ఈ మధ్యనే "అర్జున్ రెడ్డి" సినిమా ని హిందీ లో "కబీర్ సింగ్" గా తీసి హిట్ అందుకున్న డైరెక్టర్ సందీప్ వంగా ప్రస్తుతం రన్బీర్ కపూర్ హీరోగా "యానిమల్" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత సందీప్ వంగ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఒక సినిమా తీయబోతున్నారు.

అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ సందీప్ వంగా సినిమాకి డేట్లు ఇవ్వటం ఇప్పట్లో జరగని పని అని అందరూ అనుకున్నారు. మరోవైపు అనిమల్ సినిమా 2023 ఆగస్టు 7న విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ తర్వాత సందీప్ ఖాళీనే.

కానీ సందీప్ మాత్రం ప్రభాస్ సినిమాని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారట. తాజా సమాచారం ప్రకారం "స్పిరిట్" సినిమా కోసం "యానిమల్" సినిమాని సందర్భంగా కావాలని ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరికొందరు మాత్రం సందీప్ వంగా ప్యారలల్ షూటింగ్ చేయబోతున్నారని అంటున్నారు.

ఇక సందీప్ ప్లాన్ ఎలా ఉన్నా ప్రభాస్ చేతిలో మాత్రం ఇప్పుడు సాలార్, ప్రాజెక్ట్ కే, ఆది పురుష సినిమాలతో బిజీ గా ఉన్నారు. మరి సందీప్ రెడ్డి వంగా తో సినిమా కోసం ప్రభాస్ ఎప్పుడు డేట్లు ఇస్తారో తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story