Prabhas: ‘స్పిరిట్‌’ హారర్‌ సినిమా కాదు.. పోలీసుగా ప్రభాస్‌.. ‘స్పిరిట్‌’ స్టోరీ లైన్‌ చెప్పేసిన సందీప్‌ రెడ్డి

Sandeep Reddy Vanga Leaked Prabhas Spirit Movie Storyline
x

Prabhas: ‘స్పిరిట్‌’ హారర్‌ సినిమా కాదు.. పోలీసుగా ప్రభాస్‌.. ‘స్పిరిట్‌’ స్టోరీ లైన్‌ చెప్పేసిన సందీప్‌ రెడ్డి

Highlights

Prabhas: ‘యానిమల్‌’ విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా . సందీప్‌ రెడ్డి వంగా, ప్రభాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.

Prabhas: ‘యానిమల్‌’ విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా . సందీప్‌ రెడ్డి వంగా, ప్రభాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు కానీ.. సినిమాకి ‘స్పిరిట్‌’అనే టైటిల్‌ మాత్రం ఫిక్స్‌ చేశారు. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక రూమర్‌ మాత్రం వైరల్‌ అవుతోంది.

స్పిరిట్‌ ఓ హారర్‌ మూవీ అని.. ఇందులో ప్రభాస్‌ మాంత్రికుడిగా కనిపించబోతున్నాడనే వార్తలు గత కొన్నాళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఓ బాలీవుడ్‌ సినిమా టీజర్‌ లాంఛ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ‘స్పిరిట్‌’పై స్పందించారు. ‘ప్రస్తుతం నేను ప్రభాస్‌తో చేయనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను. అందరూ అనుకుంటున్నట్లు ఇది హారర్‌ స్టోరీ కాదు. ఓ నిజాయితీ కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌ కథ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనంతరం ‘యానిమల్‌ పార్క్‌’ను రూపొందిస్తా. ప్రస్తుతానికి ఈ అప్‌డేట్‌ మాత్రమే ఇవ్వగలను’ అని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories