Sandeep Reddy Vanga: భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్న సందీప్ రెడ్డి

Sandeep Reddy Vanga: ప్రాఫిట్ లో పెద్ద షేర్ తీసుకోబోతున్న "అర్జున్ రెడ్డి" డైరెక్టర్

admin1
Updated on: 1 Nov 2021 5:30 PM IST
Sandeep Reddy Vanga is Going to Take a Huge Remuneration to Prabhas Movie
X
ప్రభాస్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకోనున్న సందీప్ రెడ్డి వంగ (ఫైల్ ఇమేజ్)

Sandeep Reddy Vanga: "అర్జున్ రెడ్డి" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తో అందరి దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక తెలుగులో మళ్ళీ సందీప్ దర్శకత్వం వహించింది లేదు. అయితే బాలీవుడ్లో "అర్జున్ రెడ్డి" సినిమా "కబీర్ సింగ్" అనే టైటిల్ తో రీమేక్ చేశారు సందీప్. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో "యానిమల్" సినిమాతో బిజీగా ఉన్నారు సందీప్. తాజా సమాచారం ప్రకారం సందీప్ వంగ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నారు.

ఈ సినిమాకి "స్పిరిట్" అనే టైటిల్ ని ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో సినిమా కాబట్టి అభిమానులకి ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారట. అయితే రెమ్యునరేషన్ విషయంలో తాను కూడా 'తగ్గేదే లే' అంటూ సందీప్ రెడ్డి కూడా భారీగానే రెమ్యునరేషన్ను అందుకోబోతున్నాడట. ఈ సినిమా విడుదల తర్వాత సినిమాపై ప్రాఫిట్స్ లో 50% షేర్స్ ని సందీప్ వంగ రెమ్యూనరేషన్ గా తీసుకోబోతున్నారు సందీప్. సినిమా బ్లాక్ బస్టర్ అయితే సందీప్ కి భారీ మొత్తంలోనే అమౌంట్ వస్తుందని చెప్పుకోవచ్చు.

admin1

admin1

Next Story