Sanjjanaa Galrani : నటి సంజనకి బెయిల్‌!

ఆ మధ్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి సంజనకి కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. దాదాపుగా మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవిస్తున్న సంజనకు కర్ణాటక హైకోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ ను మంజూరు చేసింది

Krishna
Published on: 11 Dec 2020 5:47 PM IST
Sanjjanaa Galrani : నటి సంజనకి బెయిల్‌!
X

ఆ మధ్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి సంజనకి కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. దాదాపుగా మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవిస్తున్న సంజనకు కర్ణాటక హైకోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ ను మంజూరు చేసింది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సంజన పిటిషన్‌ వేయడంతో దానిని పరిగణలోకి తీసుకున్న కోర్టు .. రూ. 3 లక్షల వ్యక్తిగత బాండ్‌ సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ కేసులో ఎప్పుడంటే అప్పుడు పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని, సాక్ష్యాలను దెబ్బతీసేలా వ్యవహరించకూడదని పేర్కొంటూ కోర్టు బెయిల్‌ ను మంజూరు చేసింది. ఈ నేపధ్యంలో సంజన ఈ రోజు సాయింత్రం లేదా రేపు జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. . నటి సంజనతో పాటు మరో నటి రాగిణి కూడా ఈ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

Krishna

Krishna

Next Story