Tirumala: శ్రీవారి సేవలో సంయుక్త మీనన్.. ఆ సినిమా కోసమే మొక్కులు..

Samyuktha Menon Visit Tirumala
x

Tirumala: శ్రీవారి సేవలో సంయుక్త మీనన్.. ఆ సినిమా కోసమే మొక్కులు..

Highlights

Samyuktha Menon: ప్రముఖ సినీనటి కేరళ కుట్టి సంయుక్త మీనన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Samyuktha Menon: ప్రముఖ సినీనటి కేరళ కుట్టి సంయుక్త మీనన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం సంప్రదాయ వస్త్రధారణలో.. వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల పండితులు వేదాశీర్వచనం అందించగా...ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సంయుక్త మీనన్ మాట్లాడుతూ... శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రావడం ఇదే మొదటిసారి అని అన్నారు. స్వామి వారి దర్శనం చాలాబాగా జరిగిందన్నారు. ఈ నెల 21వ తేదీ విరూపాక్ష సినిమా విడుదల సందర్భంగా స్వామి వారిని ఆశీర్వాదం కోసం వచ్చానన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories