Samuthirakani: స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో నితిన్‌

Macherla Niyojikavargam: ఒకవైపు నటుడిగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సముద్రఖని.

Arun Chilukuri
Updated on: 11 Aug 2022 8:30 PM IST
Samuthirakani Revealed that he Will Direct Nithiin Very Soon
X

Samuthirakani: స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో నితిన్‌

Macherla Niyojikavargam: ఒకవైపు నటుడిగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సముద్రఖని. ఒకవైపు తెలుగులో చాలా వరకు విలన్ పాత్రలలో కనిపిస్తున్న సముద్రఖని ఈ మధ్యనే మహేష్ బాబు హీరోగా నటించిన "సర్కారు వారి పాట" సినిమాలో కూడా ముఖ్య విలన్ పాత్రలో కనిపించారు. అయితే తాజాగా నితిన్ హీరోగా నటించిన "మాచర్ల నియోజకవర్గం" సినిమాలో కూడా సముద్రఖని విలన్ పాత్ర పోషించారు.

తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ సముద్రఖని నితిన్ హీరోగా ఒక సినిమాకి దర్శకత్వం వహించాలని ఉంది అని అన్నారు. "నా దర్శకత్వంలో నితిన్ హీరోగా కచ్చితంగా ఒక సినిమా ఉంటుంది. నిజానికి రెండు నెలల క్రితమే మేము సినిమాకి సంబంధించిన కథ గురించి మాట్లాడుకున్నాము. ఇక మా ఇద్దరికీ సమయం కుదిరినప్పుడు ఖచ్చితంగా సినిమా పట్టాలెక్కుతుంది" అని క్లారిటీ ఇచ్చారు సముద్రఖని.

ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "గాడ్ ఫాదర్" మరియు నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న "దసరా" సినిమాలలో కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్న సముద్రఖని పవన్ కళ్యాణ్ మరియు సాయితేజ్ హీరోలుగా ఒక రీమేక్ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story