Samuthirakani: పవన్ కళ్యాణ్ అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చిన సముద్రఖని

Samuthirakani: పవన్ కళ్యాణ్ అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చిన సముథ్రకని

Dhatripriya
Updated on: 1 April 2023 9:31 PM IST
Samuthirakani Came As A Surprise To Pawan Kalyan Fans
X

Samuthirakani: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ లాగా వచ్చిన సముథ్రకని 

Samuthirakani: నటుడిగా మరియు డైరెక్టర్గా తమిళ్లో మంచి పేరు సంపాదించిన సముథ్రకని ఈమధ్య చాలా వరకు తెలుగు సినిమాలలో కనిపిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన నాని "దసరా" సినిమాలో కూడా కీలక పాత్ర పోషించిన సముథ్రకని తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న "వినోదయ సితం" తెలుగు రీమేక్ తో డైరెక్టర్గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. తమిళ్లో కూడా ఈ సినిమాకి సముథ్రకని నే దర్శకత్వం వహించారు.

ఈ మధ్యనే ఈ చిత్ర తెలుగు రీమేక్ ను అధికారికంగా లాంచ్ చేశారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ మధ్యనే సముథ్రకని ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఈ ఏడాది జులై 28న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా ఏళ్లు గడిచింది కానీ ఇంకా సినిమా షూటింగ్ పూర్తికాలేదు.

మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో "ఉస్తాద్ భగత్ సింగ్", సుజిత్ దర్శకత్వంలో "ఓజీ" సినిమాలు కూడా లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్ ఇంకా ఈ రెండు సినిమాలను మొదలు కూడా పెట్టలేదు. కానీ సడన్ గా పవన్ కళ్యాణ్ జాబితాలో చేరిపోయిన సముథ్రకని మాత్రం తన సినిమా షూటింగ్ మొదలుపెట్టడమే కాక విడుదల తేదీని కూడా ఖరారు చేసేసి ఫాన్స్ కి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చేశారు. అయితే ఈ సినిమాపై అంత భారీ అంచనాలు లేవు మరి ఈ సినిమా ఎంతవరకు హిట్ అయ్యి సముద్రఖని ని ఒక మంచి డైరెక్టర్ గా కూడా టాలీవుడ్ కి పరిచయం చేస్తుందో లేదో వేచి చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story