Bazaar Rowdy: రౌడీయిజం చేయాలంటే దమ్ము కావాలి..'బజార్ రౌడీ' టీజర్ అదిరింది

Bazaar Rowdy: హృదయకాలేయం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు సంపూర్ణేష్ బాబు.

Samba Siva Rao
Updated on: 25 March 2021 7:51 PM IST
Sampoornesh babu new movie
X

సంపూర్ణేష్ బాబు

Bazaar Rowdy: సినిమాపై పిచ్చి ప్రేమతో తెలుగు ఇండస్ట్ర్రీలోకి అడుగుపెట్టాడు సంపూర్ణేష్ బాబు. హృదయకాలేయం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు సంపూర్ణేష్ బాబు. బర్నింగ్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాచుకున్నాడు. సింగం 123, కొబ్బరిమట్ట, వంటి మూవీస్ తో పర్వాలేదని పించాడు. తాజా సంపూర్ణేష్ బాబు 'బజార్ రౌడీ' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.

ఇక ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. రౌడీయిజం చేయాలంటే జీపు, జీపులో పెట్రోల్‌.. దాంట్లో రౌడీలు కాదురా.. దమ్ము.. దమ్ముకావాలి అంటూ సంపూర్ణేష్ ఇంట్రో సాగుతుంది. ఈ టీజర్‌లో సంపూ చెప్పే డౌలాగ్స్ ప్రేక్షకులను గుడుపుబ్బా నవ్విస్తోంది. హీరోయిన్ తల్లితండ్రులను అదేనండి అత్తా మామలను అల్లరి పెట్టే అల్లుడు పాత్రలో సంపూ చెలరేగి పోయాడు.

ఈ చిత్రాన్ని కేఎస్‌ క్రియేషన్స్ పతాకంపై సందిరెడ్డి శ్రీనివాస్‌రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో షియాజీ షిండే, పృథ్వి, నాగినీడు, ష‌ఫి, జీవ‌, స‌మీర్‌, మణిచంద‌న‌, న‌వీన‌, ప‌ద్మావ‌తి వంటి వారు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వసంలత నాగేశ్వరరావు దర్శకత్వంలో వస్తున్న సాయికార్తీక్‌ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు సంపూర్ణేష్ బాబు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story