'మన్మధుడు 2' కోసం స్పెషల్ క్యామియో

మన్మధుడు 2 కోసం స్పెషల్ క్యామియో
x
Highlights

2002 లో విడుదలైన 'మన్మధుడు' సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమా సీక్వెల్ గా 'మన్మధుడు 2' సినిమాలో నటించబోతున్నారు అక్కినేని...

2002 లో విడుదలైన 'మన్మధుడు' సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమా సీక్వెల్ గా 'మన్మధుడు 2' సినిమాలో నటించబోతున్నారు అక్కినేని నాగార్జున. ఈ మధ్యనే 'చి ల సౌ' సినిమాతో దర్శకుడిగా మారిన హీరో రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ 15వ తారీకు నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యామియో ఉండబోతోంది. ఇంతకీ ఆ క్యామియో ఇచ్చేది ఎవరిదో కాదు అక్కినేని కోడలు సమంత.

స్టార్ హీరోయిన్ సమంత 'మన్మధుడు 2' సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించనుంది. ఈమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఆమె పాత్ర కథకు చాలా కీలకంగా మారనుందని సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ మామ కోడళ్ళు 'మనం' మరియు 'రాజుగారిగది 2' కలిసి నటించిన సంగతి తెలిసిందే. 'మనం' సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ 'రాజు గారి గది 2' పర్వాలేదనిపించింది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'మన్మధుడు' సినిమా లాగానే ఈ సినిమా కూడా బ్లాక్బస్టర్ అవుతుందని అక్కినేని ఫాన్స్ విశ్వసిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories