Bangarraju Movie: 'బంగార్రాజు' లో చైతు జోడీ ఎవరంటే..!

Samantha Pair With Naga Chaitanya In Bangarraju
x

నాగార్జున, నాగ చైతన్య (ఫొటో ట్విట్టర్)

Highlights

Bangarraju Movie: కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించనున్న సినిమా 'బంగార్రాజు'.

Bangarraju Movie: కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించనున్న సినిమా 'బంగార్రాజు'. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. షూటింగ్‌ను ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య కూడా కీలక పాత్రలో నటించనున్నాడు. తాజాగా ఈ సినిమాపై ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడిగా తన భార్య అక్కినేని సమంతా నటించనున్నారంట. ఈ వార్తపై ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం అయితే లేదు. కాగా, ఈ జంట ఎన్నో సినిమాల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. 'ఏం మాయ చేశావే' సినిమాతో సామ్-చైతూ జోడీ మొదటి సారి కలిసి నటించారు. ఆ తరువాత వీళ్లు.. 2017లో మ్యారేజ్ చేసుకున్నారు. వివాహం అనంతరం 'ఓ బేబీ' మూవీలో ఈ జోడీ నటించి, మెప్పించారు. మరోసారి ఈ జోడీ సందడి చేసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.

సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తోంది. అలాగే నాగచైతన్య భార్య పాత్రలో సమంత నటిస్తుందంట. ఈ జోడీ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణలకు కొడుకు, కోడలుగా కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories