Nani New Movie: నాని సినిమాలో సెకండ్ హీరోయిన్ గా స్టార్ బ్యూటీ?

* ఈ సినిమాలో మహానటి బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది

admin1
Published on: 9 Nov 2021 12:57 PM IST
Samantha will Act as Second Heroin with Nani in Dasara Movie
X

నాని తో రెండవ సారి నటించేందుకు సిద్ధమైన సమంత(ఫైల్ ఫోటో)

Nani New Movie: నాచురల్ స్టార్ నాని ఈ మధ్యనే విడుదలైన "టక్ జగదీశ్" సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని "శ్యామ్ సింగరాయి" మరియు "అంటే సుందరానికి" సినిమాలతో బిజీగా ఉన్నారు.

తాజాగా "దసరా" అనే ఒక కొత్త సినిమాని కూడా ప్రకటించారు నాని. కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహానటి బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. "నేను లోకల్" సినిమా తర్వాత నాని కీర్తి సురేష్ కాంబినేషన్లో రాబోతున్న రెండవ సినిమా ఇది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా ఉండబోతోందని, ఆ పాత్ర కోసం దర్శక నిర్మాతలు స్టార్ హీరోయిన్ సమంత అయితే బాగుంటుందని అనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

ఇప్పటికే నాని సమంత కాంబినేషన్ లో విడుదలైన "ఎటో వెళ్లిపోయింది మనసు" సినిమా మంచి విజయాన్ని సాధించింది. మరి ఈ సినిమాలో సమంత మళ్లీ నాని సరసన కనిపిస్తుందా అని తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

admin1

admin1

Next Story